‘యానిమల్’ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకవుతారు.!

- November 23, 2023 , by Maagulf
‘యానిమల్’ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకవుతారు.!

బాలీవుడ్ మూవీ ‘యానిమల్’‌కి తెలుగులోనూ బోలెడంత క్రేజ్ దక్కుతోంది. డైరెక్ట్ తెలుగు మూవీలానే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ప్రచార చిత్రాలు, ముఖ్యంగా ‘నాన్న నువ్వంటే ప్రాణం..’ సాంగ్‌కి తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ చాలా చాలా ఎక్కువని తెలిసింది. అక్షరాలా 3 గంటల 21 నిమిషాలు అంటే దాదాపు మూడున్నర గంటల సినిమా అన్నమాట.

అంత లాంగ్ రన్ టైమ్ వున్న సినిమాలు ఇంతవరకూ సక్సెస్ కాలేదు. కానీ, ‘యానిమల్’ కథా నేపథ్యం అంత రన్ టైమ్‌ని లాక్ చేయాల్సి వచ్చిందట. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.

డిశంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మండన్నా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సీనియర్ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు. నిర్మాణ పరంగా చాలా చాలా రిచ్‌గా క్వాలిటీగా కనిపిస్తోంది.

చాలా అంచనాలున్నాయ్ ఈ సినిమా మీద. అయితే, రన్ టైమ్ కాస్త ఆలోచింపచేస్తోంది. చూడాలి మరి, కంటెంట్ ఆ రేంజ్‌లో వుంటే, రన్ టైమ్‌నీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారుగా.!  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com