కిడ్నీ వ్యాధిని ముందుగా గుర్తించడం ఎలా.?
- November 23, 2023కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. శరీరం పని తీరు సక్రమంగా వుండాలంటే, కిడ్నీలు ఆరోగ్యంగా వుండాల్సిందే. అయితే, కిడ్నీల ఆరోగ్యంగా వున్నాయో లేదో తెలుసుకోవడం ఎలా.?
కిడ్నీ సమస్యల్ని సైలెంట్ కిల్లర్స్‌గా అభివర్ణిస్తారు. అయితే, కొన్ని రకాల లక్షణాలతో కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించొచ్చు. తీవ్రమైన తలనొప్పి, మూత్రంలో మంట, రక్తం పడడం, అలసట, నీరసం, ఆకలి లేకపోవడం, బరువు పెరగడం లేదా తగ్గిపోవడం, మడమల వాపు.. తదితర లక్షణాల ద్వారా కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించొచ్చు.
ఈ సమస్యలున్నట్లయితే, ముందుగా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేయించాల్సి వుంటుంది. వైద్యుని పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స చేయించుకోవాలి. ఆల్రెడీ డయాబెటిక్స్ అయితే, క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకుంటూ వుండాలి.
ఒక్కసారి మూత్ర పిండాల సమస్యలకు గురయితే, అది దీర్ఘకాలిక సమస్యగా పరిణమించొచ్చు. సో, కిడ్నీ వ్యాధులు చిన్న చిన్న సమస్యలే అయినప్పటికీ అశ్రద్ధ చేయరాదు. ఆ సమస్యలు ముదిరితే దీర్ఘకాలం బాధపడాల్సి వస్తుంది. ప్రాణాపాయ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్