బెయిల్ రద్దు పిటిషన్.. జగన్, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు
- November 24, 2023
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని రఘురాజు తరపు న్యాయవాది ధర్మాసనంకు తెలిపారు. జగన్ తోపాటు, సీబీఐ, ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
మరోవైపు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్ లో రఘురాజు కోరారు. దీన్ని పిటిషన్ కు జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఇంకోవైపు బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురాజు న్యాయవాది కోర్టును కోరారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







