ఒమన్‌లో అస్థిర వాతావరణం..అలెర్ట్ జారీ
- November 25, 2023
మస్కట్: నవంబర్ 26 ఆదివారం వరకు ఒమన్ సుల్తానేట్ను ఎగువ వాయు ద్రోణి ప్రభావితం చేస్తుందని నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో ఉత్తర అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ దఖిలియా, మస్కట్, గవర్నరేట్లతోపాటు ఉత్తర అల్ షర్కియా మరియు దక్షిణ అల్ షర్కియాలలో వడగళ్లతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఒమన్ సముద్ర తీరాలు మరియు అల్ హజర్ పర్వతాలు మరియు పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ముసందమ్ పశ్చిమ తీరాలు, ఒమన్ సముద్ర తీరాల వెంబడి సముద్రపు అలలు 2 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయి. వర్షపాతం, పొంగిపొర్లుతున్న లోయల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ బులెటిన్లు & నివేదికలను అనుసరించాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







