భారీ స్మగ్లింగ్ గుట్టురట్టు..416250 క్యాప్టాగన్ మాత్రలు స్వాధీనం
- November 25, 2023
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌లోని జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ ఓడరేవుకు వచ్చిన ఫిప్ మెట్ లో దాచిన 416,250 క్యాప్‌గాన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుంది. కర్టెన్లతో కూడిన షిప్‌మెంట్ వచ్చిందని, దానిని కస్టమ్స్ అధికారులు పరిశీలించగా కర్టెన్‌లలో భారీ ఎత్తున్న క్యాప్గాన్ మాత్రలను దాచిపెట్టినట్లు గుర్తించినట్లు అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. దిగుమతులు, ఎగుమతులపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌లోని భాగస్వాములతో స్మగ్లర్ల ప్రయత్నాలపై నిఘా ఉంచామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ సంబంధిత సమాచారం తెలిస్తే నంబర్ (1910) లేదా అంతర్జాతీయ నంబర్ (00966114208417) లేదా ఇ-మెయిల్ ([email protected]) ద్వారా సమాచారం అందించాలని, జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అథారిటీ పిలుపునిచ్చింది. నివేదించిన సమాచారం సరైనదని తేలితే విజిల్‌బ్లోయర్‌లకు నగదు బహుమతి అందజేస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..