చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్..
- November 26, 2023
చైనా: ప్రపంచాన్ని వణించిన కోవిడ్ -19 మహమ్మారిని మర్చిపోక ముందే రకరకాల వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. చైనాలో మరో మిస్టీరియస్ వైరస్ కలకలం రేపుతోంది. ఇది కూడా కోవిడ్ తరహాలో విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయ్యింది.
కోవిడ్ తరహాలో చైనాలో మిస్టీరియస్ న్యుమోనియా వైరస్ విజృంభిస్తోంది. సౌత్ చైనాలో ముఖ్యంగా పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తి గణనీయంగా ఉంది. అక్కడి ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో వీరు ఇబ్బంది పడుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైనాను వివరణ కోరింది.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ప్రజలు పరిశుభ్రంగా ఉండాలని, వైద్యుల సూచనలు పాటించాలని సూచించింది. ఈ కొత్త వైరస్ వ్యాప్తికి గల కారణాలపై చైనా ఆరోగ్య అధికారులు అంతర్జాతీయ నిపుణుల సహకారంతో ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైరస్ కోవిడ్-19 ను పోలి ఉన్నప్పటికీ దీనికి మూలం మాత్రం కరోనా వైరస్ అని ప్రాథమిక పరీక్షలు నివేదిస్తున్నాయి. ప్రస్తుతం ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ ఈ కేసులు మాత్రం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చైనాలో కొత్త వైరస్ కలకలం నేపథ్యంలో భారత్ అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వెంటనే సమీక్ష నిర్వహించాలని సూచించింది. ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు, ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లపై దృష్టి పెట్టాలని కేంద్ర వైద్యశాఖ లేఖ రాసింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







