రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోడీ
- November 26, 2023
తిరుమల: తెలంగాణలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని రోడ్డు మార్గం ద్వారా తిరుమల పయనమయ్యారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మోడీ ఈ రాత్రికి తిరుమలలోని రచన గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు.
తిరుపతి, తిరుమలలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు పర్యటిస్తారు.షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసి, సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.
2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.ఇప్పుడు నాలుగోసారి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు మోదీ.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి