దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో 'పుస్తక శ్రవణం'
- May 26, 2016
'ఇయర్ ఆఫ్ రీడింగ్' అనే కార్యక్రమంలో భాగంగా, దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇకపై ప్రయాణీకులకు 'పుస్తకాల్ని' వినిపించనుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించిన దుబాయ్ మెట్రో, ఆర్‌టిఏ బస్సుల్లో డిజిటల్ పద్ధతిలో పుస్తకాల్లోని విషయాల్ని ప్రయాణీకులకు విన్పించేలా చేయబోతున్నారు. దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్ట్రేటజీ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ అసిస్టెంట్ జెక్రెటరీ జనరల్ ఐషా అబ్దుల్లా మిరన్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తామని వివరించారామె. 'లెర్నింగ్ త్రూ రీడింగ్' అనే కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేయడానికి 162 ఇనీషియేటివ్స్ ముందుకు వచ్చాయనీ, వాటిల్లో కొన్ని ఇప్పటికే అమల్లో ఉండగా, మరికొన్ని ఈ ఏడాది చివరి నాటికి ఎగ్జిక్యూట్ చేయబడ్తాయని చెప్పారు ఐషా అబ్దుల్లా మిరన్. త్వరలో దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ద్వారా మొబైల్ బుక్ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించనున్నామని ఆమె వివరించారు. వర్క్‌షాప్‌లను నిర్వహించి, పిల్లలు తమ నాలెడ్జ్‌ని పెంచుకునేలా చేయడం అలాగే కథలు రాసేలా వారిలోని టాలెంట్‌ని వెలికి తీసేలా సహాయ సహకారాలు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారామె.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







