ఫేబర్ కాస్టెల్ స్పెక్ట్రా 2023 విజేతలను ప్రకటించిన ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్
- November 27, 2023
బహ్రెయిన్: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ICRF), ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ‘ఫేబర్ కాస్టెల్ స్పెక్ట్రా 2023’ పేరుతో 15వ ఆర్ట్ కార్నివాల్‌ను శుక్రవారం ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB) ఇసా టౌన్ ప్రాంగణంలో నిర్వహించింది. బహ్రెయిన్ యువతలో కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ ఆర్ట్ కార్నివాల్ జరిగింది. ఉదయం ఐసిఆర్‌ఎఫ్ సభ్యులు, వాలంటీర్ల సమక్షంలో ఎంబసీ సెకండ్ సెక్రటరీ ఇహ్జాస్ అస్లాం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా.. సాయంత్రం కళాపోటీ విజేతల ప్రకటనతో కార్యక్రమం ముగిసింది. ఈ సంవత్సరం 'ఫేబర్ కాస్టెల్ స్పెక్ట్రా 2023' పోటీలో బహ్రెయిన్‌లోని దాదాపు 25 పాఠశాలల నుండి దాదాపు 3000 మంది పిల్లలు పాల్గొన్నారు. ఇసా టౌన్‌లోని ISB జషన్మల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విజేతలను సన్మానించారు. విజేత ట్రోఫీలు, సర్టిఫికెట్లను భారత రాయబారి వినోద్ కె. జాకబ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ICRF చైర్మన్ డాక్టర్ బాబు రామచంద్రన్, జనరల్ సెక్రటరీ పంకజ్ నల్లూర్, వైస్ చైర్మన్ అడ్వకేట్ వీకే థామస్, అడ్వైజర్/ఎక్స్ అఫీషియో అరుల్దాస్ థామస్, అడ్వైజర్ భగవాన్ అసర్పోటా, ట్రెజరర్ మణి లక్ష్మణమూర్తి, జాయింట్ సెక్రటరీ నిషా రంగరాజన్, జాయింట్ సెక్రటరీ అండ్ స్పెక్ట్రా కన్వీనర్ అనీష్ జోనర్ శ్రీధరన్, కన్వీనర్ శ్రీధరన్, ఎస్. టైటిల్ స్పాన్సర్ ఫేబర్ కాస్టెల్ తరపున కంట్రీ హెడ్ నితిన్ జాకబ్, అబ్దుల్ షుకూర్, ICRF సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ పోటీ ద్వారా వచ్చే మొత్తాన్ని నెలకు BD125 కంటే తక్కువ వేతనాలు పొందుతూ మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన కుటుంబ సంక్షేమ నిధికి వెళుతుంది.
విజేతల వివరాలు:
గ్రూప్ 1లో విజేత న్యూ మిలీనియం స్కూల్ నుండి జుబల్ జాన్ జోజి; రెండవ స్థానంలో బహ్రెయిన్ ఇండియన్ స్కూల్‌కు చెందిన చిన్మయి మణికందన్. మూడవ స్థానం: ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (రిఫా) నుండి ధృవ్ టినీ చంద్; నాల్గవ స్థానం: ఇబ్న్ అల్ హైథమ్ ఇస్లామిక్ స్కూల్ నుండి హైకా మొహమ్మద్ మఫాజ్; ఐదవ స్థానం: ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (రిఫా) నుండి ఆదిల కురుకతోడిక.
గ్రూప్ 2 విజేత ఇండియన్ స్కూల్ బహ్రెయిన్-రిఫాకు చెందిన ఎలీనా ప్రసన్న; రెండవ స్థానం ది న్యూ ఇండియన్ స్కూల్ నుండి ఒయింద్రిలా డే; మూడవ స్థానం న్యూ మిలీనియం స్కూల్ నుండి క్రిస్టీ స్టీఫెన్; నాల్గవ స్థానం ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఇసా టౌన్) నుండి శ్రీహరి సంతోష్. ఐదవ స్థానం ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఇసా టౌన్) నుండి దక్ష్ ప్రవీణ్ ఘాడి.
గ్రూప్ 3లో విజేత సేక్రేడ్ హార్ట్ స్కూల్ నుండి ఎరికా జియోనా గోన్సాల్వేస్; రెండవ స్థానంలో ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఇసా టౌన్) నుండి అయన షాజీ మాధవన్; మూడో స్థానంలో ది ఏషియన్ స్కూల్ బహ్రెయిన్‌కు చెందిన కృష్ణ అనిల్ కుమార్; నాల్గవ స్థానంలో ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఇసా టౌన్) నుండి దియా షెరీన్; ఐదవ స్థానంలో ది ఏషియన్ స్కూల్ నుండి అన్నా థెరిస్ సిజో ఉన్నారు.
గ్రూప్ 4 విజేతలుగా ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఇసా టౌన్)కి చెందిన శిల్పా సంతోష్ ప్రథమ స్థానంలో నిలవగా, ఏషియన్ స్కూల్‌కు చెందిన శ్రేయాస్ ఎంఎస్ ద్వితీయ స్థానంలో, ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఇసా టౌన్)కి చెందిన స్వాతి సజిత్ తృతీయ స్థానం, నాల్గవ స్థానంలో అన్లీన్ ఆంటోనీ మజువెంచెరిల్ ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఇసా టౌన్), ది ఏషియన్ స్కూల్ నుండి ఐదవ స్థానం ఫజర్ ఫాతిమా.
గ్రూప్ 5 విజేతలు వికాస్ కుమార్ గుప్తా, రెండవ స్థానంలో నితాషా బిజు మరియు మూడవ స్థానంలో భూపేంద్ర పాఠక్ ఉన్నారు.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..