భారత పౌరుల సమస్యలను పరిష్కరించిన ఓపెన్ హౌజ్

- November 28, 2023 , by Maagulf
భారత పౌరుల సమస్యలను పరిష్కరించిన ఓపెన్ హౌజ్

బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన ఓపెన్ హౌజ్ ను ఏర్పాటు చేసారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రవాసులు పాల్గొన్నారు. గత ఓపెన్ హౌజ్ లో లేవనెత్తిన చాలా సమస్యల పరిష్కారం పట్ల రాయబారి సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులకు వారి సత్వర మద్దతు మరియు సహకారం కోసం తన కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక కాన్సులర్ మరియు కార్మిక సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేసినందుకు భారతీయ సమాజం, సంస్థలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) ద్వారా అవసరమైన భారతీయ పౌరులకు బోర్డింగ్, వసతిని అందించడంతోపాటు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు మరియు టిక్కెట్లను మంజూరు చేయడం ద్వారా ఇంటి పనిమనిషితో సహా కష్టాల్లో ఉన్న భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేస్తూనే ఉందన్నారు. ఓపెన్ హౌజ్ లో పాల్గొన్నందుకు అన్ని భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సభ్యులకు రాయబారి జాకబ్ కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com