ఉమ్ అల్ క్వైన్‌లో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు

- November 28, 2023 , by Maagulf
ఉమ్ అల్ క్వైన్‌లో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు

యూఏఈ: యూఏఈలో 52వ జాతీయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉమ్ అల్ క్వైన్ అధికారులు ఎమిరేట్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50 శాతం తగ్గింపును ప్రకటించారు. ఉమ్ అల్ క్వైన్ పోలీస్ జనరల్ కమాండ్ నవంబర్ 1, 2023కి ముందు ఉమ్ అల్ క్వైన్ ఎమిరేట్‌లో జరిగిన అన్ని రకాల ఉల్లంఘనలపై తగ్గింపు ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్ తీవ్రమైన ఉల్లంఘనలను వర్తించదని తెలిపారు. డిసెంబర్ 1, 2023 నుండి జనవరి 7, 2024 వరకు ఆఫర్ చెల్లుబాటు అవుతుందన్నారు. సిగ్నల్ జంప్, డేంజరస్ డ్రైవింగ్,  ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేయడం, గరిష్ట వేగ పరిమితి ఉల్లంఘనలు, లైసెన్స్ లేకుండా వాహనం ఇంజిన్ లేదా బేస్ "ఛాసిస్"లో మార్పులు చేయడం లాంటి నేరాలకు సంబంధించి ఉల్లంఘనలకు ఈ ఆఫర్ వర్తించదని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com