నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- November 28, 2023
హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
తెలంగాణలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎక్కడ కూడా నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదు. నవంబర్ 30వ తేదీ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది.
సాయంత్రం 5 గంటల తరువాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేయవద్దని ఈసీ సూచించింది. సాయంత్రం 5 గంటల తరువాత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల