SR43.735 బిలియన్లకు పెరిగిన సౌదీ వాణిజ్య మిగులు

- November 29, 2023 , by Maagulf
SR43.735 బిలియన్లకు పెరిగిన సౌదీ వాణిజ్య మిగులు

రియాద్:  సెప్టెంబర్ 2023లో సౌదీ అరేబియా వాణిజ్య మిగులు SR43.735 బిలియన్లకు చేరుకుంది. సెప్టెంబరులో కింగ్డమ్ అంతర్జాతీయ వాణిజ్యం SR163.911 బిలియన్లకు చేరుకుంది.  కమోడిటీ ఎగుమతులు SR103.823 బిలియన్లు మరియు వస్తువుల దిగుమతులు SR60.088 బిలియన్లుగా నమోదు అయ్యాయి. ఎగుమతి దేశాల విభాగంలో ఆసియా దేశాలు (అరబ్,ఇస్లామిక్ దేశాలు మినహా) ముందంజలో ఉన్నాయి. మొత్తం సౌదీ కమోడిటీ ఎగుమతుల్లో 55.03% వాటాను కలిగి ఉంది. ఇది SR57.129 బిలియన్లకు సమానం. ఆ తర్వాత ఈయూ దేశాలు ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో 11.2% SR11.582 బిలియన్లు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు SR11.536 బిలియన్ల విలువ కలిగిన మొత్తం ఎగుమతుల్లో 11.1% పొంది మూడవ స్థానంలో నిలిచాయి. సెప్టెంబరులో సౌదీ ఎగుమతులలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంలో 18.3% SR18.992 బిలియన్లను కలిగి ఉంది. SR11.374 బిలియన్ల విలువైన వస్తువులతో జపాన్ రెండవ స్థానంలో(ఎగుమతులలో 11%) నిలిచింది.  9.9% వాటాతో దక్షిణ కొరియా (SR10.247 బిలియన్లు) మూడవ స్థానంలో ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com