ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపల వేలం వేళలు మార్పు
- November 29, 2023
దోహా: ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపల వేలం వేళల్లో మార్పు చేస్తూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రానికి (ట్రయల్ ప్రాతిపదికన) సమయాన్ని మార్చినట్లు పేర్కొంది. ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపలు, సీఫుడ్ వేలం నిర్వహించే సమయం మగ్రిబ్ ప్రార్థన తర్వాత (సూర్యాస్తమయం తర్వాత) కాలానికి మార్చినట్లు తెలిపింది. ఈ నిర్ణయం సరసమైన ధరలకు చేపలు, సముద్రపు ఆహారాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించింది. అదే సమయంలో మత్స్యకారులకు గరిష్ట డిమాండ్ సమయంలో వారి అమ్మకాలను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







