గూగుల్ కొత్త విధానం.. డిసెంబర్ 1 నుండి జీమెయిల్ ఖాతాల తొలగింపు!
- November 29, 2023
యూఏఈ: గూగుల్ తన కొత్త ఇన్‌యాక్టివిటీ పాలసీని ఆగస్ట్ 4న విడుదల చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 1 తర్వాత యాక్టివ్‌గా లేని జీమెయిల్ ఖాతాలను తొలగించడం ప్రారంభించనున్నట్లు వినియోగదారులకు అలెర్ట్ జారీ చేసింది. గూగుల్ ఖాతాల కోసం ఇనాక్టివిటీ వ్యవధిని రెండేళ్లకు అప్‌డేట్ చేసినట్లు వెల్లడించారు. వినియోగదారు రెండేళ్లలోపు లాగిన్ చేయకపోతే ఆ ఖాతాలను డియాక్టివ్ గా పరిగణిస్తారు. ఒకసారి తొలగించిన తర్వాత కొత్త ఖాతా కోసం Gmail చిరునామాను మళ్లీ ఉపయోగించలేరని పేర్కొంది. అయితే ప్లాట్‌ఫారమ్, ఇ-మెయిల్‌ను తుడిచిపెట్టే ముందు వినియోగదారులకు అనేకసార్లు తెలియజేయబడుతుందని స్పష్టం చేసింది. ఖాతాలపై ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు ఈ రిమైండర్ ఇ-మెయిల్‌లు పంపబడతాయన్నారు. ఇందులో భాగంగా గూగుల్ యాజమాన్యంలో ఉన్నందున యూట్యూబ్ అకౌంట్లను కూడా తొలగించనున్నారు. అయితే యూట్యూబ్ ఛానెల్‌లు, వీడియోలు లేదా వ్యాఖ్యలతో ఖాతాలకు పాలసీ నుండి మినహాయింపు ఉందని గూగుల్ తెలిపింది.
మీ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవడం ఎలా
వినియోగదారులు తమ ఖాతాలను యాక్టివేట్ గా ఉంచడంలో సహాయపడే కొన్ని సులభమైన మార్గాలను గూగుల్ సూచించింది. అవి, ఇ-మెయిల్ చదవడం లేదా పంపడం, గూగుల్ డిస్క్‌ని ఉపయోగించడం, యూట్యూబ్ వీడియో చూడటం, ఫోటోను షేర్ చేయడం, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, గూగుల్ సెర్చ్ ను ఉపయోగించడం, థార్డ్ పార్టీ అప్లికేషన్ల సేవకు గూగుల్ తో సైన్ ఇన్ చేయడం ద్వారా అకౌంట్లను యాక్టివేట్ గా పెట్టుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







