సినిమా రివ్యూ: ‘హాయ్ నాన్న’.!

- December 07, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘హాయ్ నాన్న’.!

సహజ నటుడు నాని, మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘హాయ్ నాన్న’. ఈ సినిమాని స్టార్టింగ్ నుంచే ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ప్రమోషన్‌కీ పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. ఎట్టకేలకు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ‘హాయ్ నాన్న’ ప్రేక్షకుల మనసు దోచుకుందా.? తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
విరాజ్ (నాని)కి కూతురు మహి (కియారా ఖన్నా) అంటే పంచ ప్రాణాలు. కూతురి కోసం ఏమైనా చేయడానికి వెనుకాడడు. ఆఖరికి కూతురుని కాదన్నందుకు భార్య (శృతిహాసన్)ని కూడా వదిలేస్తాడు. ఓ ప్రమాదకరమైన వ్యాధితో మహి బాధపడుతుంటుంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే బతికుతుందని తెలిసిన తన కూతురుని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు విరాజ్. మహికి కథలు వినడమంటే ఇష్టం. అమ్మలేని కథలను చెబుతూ బోర్ కొట్టించేస్తుంటాడ విరాజ్. ఒకసారి అమ్మ కథ చెప్పమని మారాం చేస్తూ అలిగి రోడ్డు పైకి వెళ్లిన మహిని యష్న (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. అతి తొందరలోనే యష్న.. మహికీ, విరాజ్‌కి దగ్గరయిపోతుంది. అప్పటికే డాక్టర్ అరవింద్ (అంగద్ బేడీ)తో ఎంగేజ్‌మెంట్ అయిపోయిన యష్న, విరాజ్, మహిలను కలిశాక అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. అసలు మహి తల్లి ఏమైంది.? ఎందుకు కూతురిని వదిలి పెట్టేసింది.? ఆ ప్రమాదకరమైన వ్యాధి నుంచి మహి తప్పించుకోగలిగిందా.? యష్న.. విరాజ్, మహి కుటుంబంలో కలిసిపోయిందా.? ఇవన్నీ తెలియాలంటే ‘హాయ్ నాన్న’ ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
ప్రమోషన్లను బట్టి ఈ సినిమా కథ ఓ మోస్తరుగా అర్ధమైపోయింది. అయితే, అందులోని డెప్త్ ఎమోషన్స్‌ని ఫీలవ్వాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. నేచురల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ వున్న నాని, ఈ సినిమా కోసం మరోసారి తన టాలెంట్ చూపించాడు. నటించాడు అనేకన్నా ఎప్పటిలాగే జీవించేశాడు. అలాగే, కూతురి పాత్ర పోషించిన మహి కూడా చాలా బాగా చేసింది. నిజంగానే నానికి కూతురా.? అనేంతలా కొన్ని సీన్లలో ఎమోషన్లు పండాయ్. ఇక, మృణాల్ గురించి చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే తన నటనా ప్రతిభ చాటుకుంది. ఈ సినిమా కోసం ఇంకోసారి తన సహజ సిద్ధమైన నటన కనబరించింది. గెస్ట్ రోల్ చేసిన శృతి హాసన్ తన పాత్ర పరిధి మేర నటించి మెప్పించింది. మిగిలిన పాత్రధారులు అంతే.

సాంకేతిక వర్గం పని తీరు:
కొత్త దర్శకుడు శౌర్యన్ తొలి సినిమాతో శభాష్ అనిపించుకున్నాడు. నాని వంటి నేచురల్ ఆర్టిస్ట్ ఆయనకు దొరకడం మంచి కథ సెట్ అవ్వడం.. నిజంగా శౌర్యన్ లక్కు తోక తొక్కాడనే చెప్పొచ్చేమో. ఇక, ఈ తరహా రొమాంటిక్ అండ్ సెంటిమెంటల్ డ్రామాస్‌కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. అబ్ధుల్ వహాద్ ఆ పనిలో హండ్రెడ్ పర్సంట్ మార్కులేయించుకున్నాడు. పాటలు అయితే, ముందే ఆదరణ దక్కించుకున్నాయ్. సీన్స్‌కి తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హృదయాలకు హత్తుకునేలా ప్లే చేశాడు అబ్దుల్. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు చక్కగా కుదిరాయ్. పీస్‌పుల్ విజువల్ ఫీస్ట్‌లా అనిపించింది.

ప్లస్ పాయింట్స్:
నటీ నటుల పర్‌ఫామెన్స్, సెంటిమెంట్ సీన్లు.. కొన్ని క్యూట్ అండ్ లవ్లీ రొమాంటిక్ సీన్లు, కథ నడిపిన విధానం, మ్యూజిక్..

మైనస్
పెద్దగా చెప్పుకోదగ్గవి లేవు కానీ, అక్కడక్కడా కొన్ని సీన్లు చాలా తక్కువ.. కాస్త సాగతీతలా అనిపిస్తాయ్.

చివరిగా: ‘హాయ్ నాన్న’ హాయిగా హృదయాలకు హత్తుకోదగ్గ రొమాంటిక్ అండ్ సెంటిమెంటల్ డ్రామా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com