రజనీ కాంత్ సినిమాలో నటించాలంటే. కమల్ కు అడ్డుపడ్డ నియమం...

- May 27, 2016 , by Maagulf
రజనీ కాంత్ సినిమాలో నటించాలంటే. కమల్ కు అడ్డుపడ్డ నియమం...

రజనీ కాంత్, కమల్ హాసన్ లు హీరోలుగా ఒకే సారి ప్రయాణం మొదలు పెట్టారు. కెరీర్ మొదట్లో ఇద్దరు కలిసి నటించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి... ఒకానొక సమయంలో కమల్ తన వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని రజనీ కాంత్ కంటే ముందే స్టార్ హీరో హోదాను అందుకున్నాడు. కానీ కెరీర్ లో కమల్ తీసుకున్న నిర్ణయాలతో పాటు రజనీ తన స్టైల్, చరిష్మాలతో అభిమానులను ఆకట్టుకొని కమల్ నుంచి స్టార్ డమ్ ని లాగేసుకున్నాడు. కానీ వీరిద్దరూ మంచి ప్రెండ్స్... కాగా శంకర్ డైరెక్షన్ లో రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ గురించి కమల్ పలు ఆసక్తి కరమైన సంగతులు వెల్లడించాడు. వివరాల్లోకి వెళ్తే...రోబో 2.0 సినిమాలో కమల్ హాసన్ ని విలన్ గా నటించమని దర్శకుడు శంకర్ అడిగారట. కానీ శంకర్ కోరికను కమల్ అంగీకరించలేదట. ఎందుకంటే కమల్, రజనీ ఒకే సినిమాలో కలిసి నటించాలంటే... ఆ సినిమాకు నిర్మాతగా వీరిద్దరిలో ఒకరు ఉండాలని నియమం పెట్టుకున్నారట. ఆ నియమం ప్రకారం రోబో సీక్వెల్ కు నిర్మాతగా వీరిద్దరిలో ఒకరు వ్యవహరించడానికి సినిమా భారీ బడ్జెట్ ది కావడంతో కమల్ ఈ సినిమాకు చాలా దూరంగా ఉన్నాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com