అమెరికాకు వెళ్లే ప్రతి ఉద్యోగికి హెచ్-1బీ వీసాకు అదనం..
- May 27, 2016
భారతీయ ఐటీ కంపెనీలకు యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ కొత్త షాక్ ను ఇచ్చింది. ఐటీ కంపెనీలో పని చేయడానికి అమెరికాకు వెళ్లే ప్రతి ఉద్యోగికి అవసరమైన హెచ్-1బీ వీసాకు అదనంగా 4 వేల డాలర్లు (2,68,181 రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే ఎల్-1 బీ వీసా కోసమైతే 4.5వేల డాలర్లు (3,01704 రూపాయలు) చెల్లించాలని వివరించింది. వీసాలకు ఈ ఫీజులు 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని చెప్పింది.దీంతో భారతీయ ఐటీ కంపెనీలపై 400 మిలియన్ డాలర్ల పెనుభారం పడనుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నదని కంపెనీలు విమర్శించాయి. మరో వైపు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై అమెరికా పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఇందుకు సంబంధించిన వివరాలను తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. 50 మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే ఏ భారతీయ కంపెనీ అయినా హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు ఈ నిబంధనలను వర్తిస్తాయని పోస్టులో వివరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









