తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ఇవ్వబోతున్న ఆటో డ్రైవర్లు..?
- December 09, 2023
హైదరాబాద్: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కలిపిస్తామని హామీ ఇచ్చిన రేవంత్..చెప్పినట్లే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకరాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది.
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే.. హైదరాబాద్ లోని ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగేందుకు సిద్ధం అయ్యారు. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తే…తమ బతుకులు ఆగం అవుతాయని..వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్ ఆధారిత వాహనాలపై ఆధారపడి బతుకుబండిని లాగుతున్న డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయారు. కాంగ్రెస్ ఆటో రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు ఆటో డ్రైవర్లు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







