తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు..

- December 09, 2023 , by Maagulf
తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు..

హైదరాబాద్: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం సీఎం గా రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. వీరికి సంబదించిన శాఖలను అధిష్టానం ఫైనల్ చేసింది. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపి..అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ప్రకటన చేశారు.

మంత్రుల శాఖల వివరాలు ఇలా ఉన్నాయి..

దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు
భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయం, చేనేత
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్‌, పర్యాటకం
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి – నీటి పారుదల, పౌరసరఫరాలు
పొన్నం ప్రభాకర్‌ – రవాణా, బీసీ సంక్షేమం
సీతక్క – పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం
కొండాసురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com