డిసెంబర్ 21 వరకు కన్జూమర్ కాన్ఫిడెన్స్ సర్వే
- December 10, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆదివారం నుండి 2023 నాల్గవ త్రైమాసికానికి వినియోగదారుల కాన్ఫిడెంట్ సర్వే 40వ సెషన్‌ను అమలు చేయడం ప్రారంభించనున్నారు. ఇది డిసెంబర్ 21 వరకు కొనసాగుతుంది. 18 ఏళ్లు పైబడిన ఒమానీ పౌరులను లక్ష్యంగా సర్వే జరుగనుంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి టెలిఫోన్ ద్వారా కూడా డేటా సేకరించబడుతుంది. వినియోగదారుల విశ్వాస సూచిక అనేది ఒమానీ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన ఆర్థిక సూచికలలో ఒకటి. కుటుంబాల ఆర్థిక స్థితి, ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా లేదా సానుకూలంగా ప్రభావితం చేసే అంశాలు, ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు అంచనాలు మరియు ఉద్యోగ అవకాశాల లభ్యతతో సహా ఒమానీ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అనేక అంశాలను కొలవడం ఈ సర్వే లక్ష్యం అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







