ఇంట్లో కుప్పకూలి 13 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి
- December 10, 2023
దుబాయ్: ఇంట్లో కుప్పకూలి 13 ఏళ్ల భారతీయ విద్యార్థి(8వ తరగతి విద్యార్థి) మృతి చెందాడు. దీంతో విషాదఛాయలు ఏర్పడ్డాయి. బుధవారం ఇంట్లో చదువుకుంటూ కుప్పకూలిన 13 ఏళ్ల విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. "అతను ఇంట్లో చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు" అని సామాజిక కార్యకర్త నసీర్ వాటనపల్లి చెప్పారు. "అతన్ని ఆసుపత్రికి తరలించినప్పుడు, అతను మెదడు రక్తస్రావంతో బాధపడుతున్నాడని డాక్టర్లు గుర్తించారు. అతన్ని వెంటిలేటర్‌పై ఉంచారు, కానీ అతను కోలుకోలేదు.’’ అని పేర్కొన్నారు. బాలుడు చాలా చురుకైన వాడని, ఫుట్‌బాల్ ఆడేవాడని, కరాటే నేర్చుకున్నాడని కుటుంబసభ్యులు చెప్పారు. మృతిచెందిన బాలుడికి ఒక చెల్లెలు ఉన్నారు. అధికారిక ప్రక్రియల అనంతరం బాలుడి మృతదేహాన్ని దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని కుటుంబ స్వగ్రామానికి తరలించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







