బిఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కెసిఆర్ ఎన్నిక
- December 10, 2023
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది. సీనియర్ లీడర్ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 37 మంది హాజరయ్యారు. శస్త్ర చికిత్స కారణంగా మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్ గైర్హాజరయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బిఆర్ఎస్ శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడానికి శనివారం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో తమ లీడర్ గా కెసిఆర్ ను ఎన్నుకుంటూ ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం ఒకే బస్సులో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







