కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

- December 10, 2023 , by Maagulf
కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మొన్ననే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకొని..

రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్‌ని క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి.. బాగోగులు తెలుసుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్‌ను పలకరించి, కేసీఆర్ ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు సీతక్క, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

కేసీఆర్‌కి పూర్తి సహాయ సహకారాలు అందించాలనీ, అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని సీఎస్‌ని ఆదేశించానన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరినట్లు తెలిపారు. అలాగే.. కేసీఆర్ ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడాలనీ, ఆయన సూచనలను అందించాలని, అసెంబ్లీకి రావాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

ఇటీవల తన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూంలో కాలు జారి పడి, కాలికి గాయం అవ్వడంతో... సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు కేసీఆర్. ఆయనకు డాక్టర్లు.. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ నడిచారు కూడా. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రత్యేక డాక్టర్ల బృందం నిరంతరం ఆయన్ని పర్యవేక్షిస్తోంది.

కేసీఆర్ బాత్ రూమ్ నుంచి వస్తున్నప్పుడు ఆయన పంచె.. కాలు కింద చిక్కుకుంది. అదే సమయంలో నడుస్తుండగా.. కాలు జారి పడిపోయారని తెలిసింది. కొంతసేపు ఇంటిలోనే ఆయనకు సేవలు అందించారు. అయినప్పటికీ కాలు సమస్య తీరకపోవడంతో, ఆర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com