కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- December 10, 2023
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఘెర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ లో కారు అదుపుతప్పి చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సివుంది.
కాగా, అక్టోబర్ నెలలో చిక్ బళ్లాపూర్ 44వ జాతీయ రహదారిపై కారు ట్రక్కును ఢీకొనడంతో 13 మంది మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ శివారులోని బెంగళూరు-హైదరాబాద్ హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ మిక్సర్ లారీని మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎంయూవీ) ఢీకొట్టింది.
దీంతో ఆరేళ్ల బాలుడు, నలుగురు మహిళలు, పీయూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సహా 13 మంది మృతి చెందారు. బెంగళూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్లాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
చిత్రావతి జంక్షన్ వద్ద ఉదయం 6.30 గంటలకు 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో, సిమెంట్ మిక్సర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







