ఇండియా, సింగపూర్ పర్యటనకు సుల్తాన్

- December 11, 2023 , by Maagulf
ఇండియా, సింగపూర్ పర్యటనకు సుల్తాన్

మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13 నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. “అతని మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13  నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్,  రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దేశాలలో పర్యటిస్తారు.  ఈ రెండు పర్యటనలలో ఒమన్ మరియు రెండు దేశాల మధ్య సహకార రంగాలపై చర్చలు జరుపుతారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం, మూడు దేశాల ప్రజల కోసం మరింత శ్రేయస్సు సాధించడానికి వివిధ రంగాలలో ఈ సంబంధాలను ప్రోత్సహించే మార్గాలపై సమీక్ష నిర్వహిస్తారు. రెండు సందర్శనల సమయంలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్, దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసాయిదీతో కూడిన అధికారిక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళుతుందని వెల్లఢించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com