ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌.. ‘ఆస్కార్ చల్లగరిగ’కు స్పెషల్ అవార్డు

- December 11, 2023 , by Maagulf
ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌.. ‘ఆస్కార్ చల్లగరిగ’కు స్పెషల్ అవార్డు

ముంబై: ముంబైలో డిసెంబర్ 10న జరిగిన 12వ ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిల్కూరి సుశీల్ రావు నిర్మించి, దర్శకత్వం వహించిన “ఆస్కార్ చల్లగరిగ” అనే డాక్యుమెంటరీ స్పెషల్ మెన్షన్ అవార్డును గెలుచుకుంది. ఈ ఫెస్టివల్‌ను మినీ బాక్స్ ఆఫీస్ వ్యవస్థాపకుడు-డైరెక్టర్ రాంభుల్ సింగ్ నిర్వహించారు. స్క్రీనింగ్‌లు ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రం అవార్డు విజేతల జాబితాను ప్రకటించారు. జ్యూరీలో ఇండియాతోపాటు విదేశాలకు చెందిన సినీ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

ఈ డాక్యుమెంటరీ 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకున్న గీత రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ కు సంబంధించినది. అతని స్వగ్రామం అయిన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తన గ్రామమైన "చల్లగరిగ"లో చిత్రీకరించారు. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత ఏప్రిల్ 2న మొదటిసారి ఆ గ్రామాన్ని చంద్రబోస్ సందర్శించాడు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలో అందులో వివరిస్తారు. “ఆస్కార్ చల్లగరిగ” అనే డాక్యుమెంటరీకి చింతల తిరుపతి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహారించారు. చంద్రబోస్‌పై తమ ప్రేమను తెలపడానికి వందలాది మంది గ్రామస్తులు కలిసి రావడంతో చల్లగైరిలో వేడుకల మూడ్‌ను ఈ డాక్యుమెంటరీలో చూపించారు. చంద్రబోస్ భార్య, స్వయంగా ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర చేసిన డ్యాన్స్ డాక్యుమెంటరీకి హైలెట్ గా నిలిచింది. 2023 మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్వహించిన వేడుకలో భారతీయ నిర్మాత ఆస్కార్‌ను మొదటిసారి గెలుచుకున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం "ఆర్ఆర్ఆర్" సినిమా నుండి "నాటు నాటు" పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును గీత రచయిత కనుకుంట్ల సుభాష్ చద్రబోస్ , సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణిలు అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com