సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ.! కానీ.!
- December 12, 2023
‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్. ఈ మధ్య అనుపమకి తిరుగే లేదు. వరుస విజయాలూ, అవకాశాలూ వరిస్తున్నాయ్. ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ సినిమాలు మంచి విజయాన్ని అందించాయ్.
త్వరలో ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది అనుపమ పరమేశ్వరన్. తాజాగా అనుపమకి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించబోతోందట.
రాజమౌళి, ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ అండ్ కాస్టింగ్ సెలక్షన్ పనుల్లో రాజమౌళి బిజీగా వున్నారు.
ఆ క్రమంలోనే అనుపమని తన సినిమా కోసం సెలెక్ట్ చేశారనీ తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాదండోయ్. మహేష్ బాబుకి చెల్లెలి పాత్ర పోషిస్తోందంతే. అయితే, రాజమౌళి సినిమాల్లోని ఏ చిన్న పాత్రయినా సరే, ఎంతో ఇంపార్టెన్స్ వుంటుంది.
అలాంటిది ఏరి కోరి అనుపమ వంటి హీరోయిన్ని ఆ పాత్ర కోసం సెలెక్ట్ చేశాడంటే.. ఖచ్చితంగా ఆ పాత్రలో డెప్త్ వుండడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు. అయితే, హీరోయిన్గా మహేష్ పక్కన ఛాన్సొస్తే అది కదా అసలు సిసలు బంపర్ ఛాన్స్.!
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







