నోరు జారినందుకు మన్సూర్‌ అలీఖాన్‌కి మద్రాస్ కోర్టు మొట్టికాయ.!

- December 12, 2023 , by Maagulf
నోరు జారినందుకు మన్సూర్‌ అలీఖాన్‌కి  మద్రాస్ కోర్టు మొట్టికాయ.!

అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల సోషల్ మీడియానే కాదు, మీడియాకీ టార్గెట్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్. సీనియర్ అండ్ స్టార్ హీరోయిన్ అయిన త్రిషతో రేప్ సీన్‌లో నటించే అవకాశం రాలేనందుకు చింతిస్తున్నా.. అంటూ బహిరంగంగా మాట్లాడి ఇండస్ట్రీ మొత్తానికీ టార్గెట్ అయ్యాడీ విలక్షణ నటుడు.

ఈ వ్యాఖ్యలతో త్రిష గుస్సా అవ్వడమే కాదు, ఆయన మాటల్ని తప్పు పట్టింది. అలాగే, పలువురు స్టార్ హీరోలూ, సెలబ్రిటీలూ సైతం మన్సూర్ వ్యాఖ్యల్ని తప్పు పడుతూ త్రిషకు బాసటగా నిలిచారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మన్సూర్ అలీ ఖాన్ మాటల్ని తప్పు పట్టారు. ఆ విషయమై చిరంజీవిపై పరువు నష్టం దావా వేశారు మన్సూర్ అలీ ఖాన్. ఆ కేసును కొట్టి పాడేస్తూ.. బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నీపై త్రిషనే కేసు పెట్టాలి.. అంటూ మద్రాస్ హైకోర్టు తాజాగా మన్సూర్‌ని మందలిస్తూ తీర్పు వెలువరించింది.

‘లియో’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మన్సూర్ అలీ ఖాన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిష సోషల్ మీడియా హ్యాండిల్‌లో తన ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్, కోలీవుడ్ టాలీవుడ్ ఇలా యావత్ సినిమా పరిశ్రమ నుంచి పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ ఇష్యూపై త్రిషకు బాసటగా నిలిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com