స్వీట్ రైస్ బాల్స్
- May 27, 2016
కావలసిన పదార్థాలు: మైదా - రెండు కప్పులు, కొబ్బరిపాలు - 1/3 క్యాన్ (తీపి కోసం పంచదార కలుపుకోవచ్చు), బ్రౌన్ షుగర్ - ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము - అరకప్పు, నూనె - అర టీస్పూన్, ఆకుపచ్చ ఫుడ్ కలర్-అర టీస్పూన్ (నచ్చిన రంగు వాడుకోవచ్చు).
తయారీ విధానం: మైదాలో కొబ్బరి పాలు కలిపి పిండి ముద్ద చేయాలి. (కొబ్బరిపాల చిక్కదనాన్ని బట్టి మరికాస్త కొబ్బరిపాలు పోయడం లేదా పిండి కలపడం వంటివి అవసరం అవుతాయి.) ఈ ముద్ద చేతికి అంటుకోకుండా గట్టిగా ఉండాలి. పిండి కలిపేటప్పుడే ఆకుపచ్చరంగు కలపాలి. పిండి బాగా కలిపాక చిన్న చిన్న ఉండలు చేయాలి. ఆ ఉండల్ని చదునుగా నొక్కి అర టీస్పూన్ బ్రౌన్ షుగర్‌ని పోసి నెమ్మదిగా చేతి వేలితో తట్టి మళ్లీ ఉండలు చేయాలి. వీటిని ఒక పళ్లెంలో పెట్టి బియ్యప్పిండిని చల్లాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లుపోసి ఎక్కువ మంటమీద పెట్టాలి. ఉడుకుతున్న నీళ్లలో రైస్ బాల్స్ వేయాలి. నీళ్లలో వేయగానే గిన్నె అడుగుకి చేరుకుని ఆ తరువాత నెమ్మదిగా పైకి వస్తాయి. ఉండలు పైకి తేలాక మంట తగ్గించి నాలుగు నిమిషాలు అలానే ఉంచాలి. ఉండలు ఉడుకుతున్నప్పుడే కూరగాయలు కోసే బోర్డు మీద నూనె పూయాలి. చిల్లుల గరిటెతో ఉడికిన రైస్ బాల్స్ తీసి నూనె పూసిన బోర్డు మీద పెట్టాలి. ఎండుకొబ్బరి పొడిని ఒక గిన్నెలో లేదా పళ్లెంలోకి తీసుకుని అందులో ఉండల్ని దొర్లించాలి. వీటిని అలానే సర్వ్ చేయొచ్చు లేదా రంగురంగుల మఫిన్ పేపర్స్‌లో చుట్టి ఇవ్వొచ్చు. ఫ్రిజ్‌లో నిల్వ చేయొద్దు. గాలి చొరబడని డబ్బాలో పెట్టి మూతపెట్టి ఉంచాలి. తయారైన ఒక్క రోజులో తింటే బాగుంటాయి. లేదంటే గట్టిపడతాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







