దంతవైద్యం & ఇంప్లాంటాలజీలో ఆక్సిజన్ థెరపీ పై అంతర్జాతీయ వర్క్‌షాప్
- December 14, 2023
హైదరాబాద్: దంత వైద్యంలో అధునాతన టెక్నాలజీ పై నగరంలోని దంత వైద్యులకు వర్క్ షాప్ ని మెడికవర్ హాస్పిటల్స్ నందు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి 100 మంది పైగా దంత వైద్యులు వివిధ హాస్పిటల్స్ నుంచి ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి పాల్గొని కార్యక్రమ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రాంభించడం జరిగింది. UK నుండి డాక్టర్ మినాస్ లెవెన్స్కీ మరియు డాక్టర్ జోహన్తో సహా ప్రఖ్యాత నిపుణులు స్పీకర్స్ గా పాల్గొని వారి అత్యాధునిక దంత ప్రక్రియలు వివరించడం జరిగింది.
ముఖ్య అతిధి డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ వైద్య మరియు దంత ప్రక్రియలు మరియు ఇంప్లాంటాలజీలో ఆక్సిజన్ థెరపీ వంటి వినూత్న విధానాలను సమగ్రపరచడం ప్రాముఖ్యతను అభినందించారు.
అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ డెంటల్ సైన్సెస్ హెడ్ డాక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ "ఆక్సిజన్ థెరపీ అనేది డెంటిస్ట్రీలో, ముఖ్యంగా ఇంప్లాంటాలజీలో ఒక విప్లవాత్మక విధానం.ఆక్సిజన్ డెంటల్ థెరపీ అనేది చికిత్సా ప్రదేశానికి క్రియాశీల ఆక్సిజన్ వాయువును నియంత్రిత డెలివరీ చేసే ప్రక్రియ.ఇది అధిక సాంద్రీకృత ఆక్సిజన్‌తో ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పనిచేస్తుంది. UK మరియు ఇతర దేశాల నిపుణులతో, అంతర్జాతీయ అనుభవాలు మరియు దంత వైద్యంలో అత్యాధునిక టెక్నాలజీ పొందడానికి హైదరాబాద్‌లోని దంతవైద్యులకు వర్క్‌షాప్ ఒక వేదికను అందించిందని ఆయన అన్నారు.ఈ వర్క్‌షాప్ ద్వారా జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడమే కాకుండా దంత నిపుణులలో నెట్‌వర్కింగ్‌ను ప్రోత్సహించింది మరియు రోగులకు మెరుగైన సంరక్షణను అందించడానికి మరియు సాంకేతికతలతో రోగులకు మెరుగైన సేవలను అందిస్తారు.

తాజా వార్తలు
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి







