పాయల్ రాజ్పుత్ ఆ విషయంలో సో గ్రేట్.!
- December 14, 2023
ఆ సినిమాలో నాకూ ఓ ఛాన్సివ్వండి.! అంటూ అందాల భామ పాయల్ రాజ్పుత్ బతిమలాడుకుంటోంది. ఇంతకీ ఏంటా సినిమా.? అంటున్నారా.? ప్రపంచం దృష్టిని ఆకర్షించి, చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించి, పెద్ద సినిమాగా అవతరించిన ‘కాంతార’.
ఈ సినిమా సెకండ్ పార్ట్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే, లేటెస్ట్గా సినిమా యూనిట్ కాస్టింగ్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ అనౌన్స్ చేసింది.
ఆ ఆడిషన్స్లో తనకీ అవకాశం కల్పించమంటూ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఓ రిక్వెస్ట్ పంపింది. పాయల్ రాజ్పుత్ ఏమీ కొత్త హీరోయిన్ కాదు. ఆల్రెడీ ‘ఆర్ ఎక్స్ 100’ వంటి ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంది. అలాంటిది జస్ట్ ఆడిషన్స్ కోసం తనకీ ఛాన్స్ కావాలని కోరింది. సోషల్ మీడియాలో పాయల్ రిక్వెస్ట్ చూసిన వారంతా ఆమెని అభినందిస్తున్నారు.
ఎందుకంటే ఓ మోస్తరు సెలబ్రిటీలెవరూ ఇలాంటి రిక్వెస్టులు పెట్టడానికి సహజంగా ఇష్టపడరు. అలాంటిది పాయల్ రాజ్పుత్ ఇలా చేసిందేంటబ్బా.! అని కొందరు వాపోతుంటే, నటిగా ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ ఇంకొందరు శభాష్ అని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







