‘సైంధవ్’ స్టోరీ అదేనా.?
- December 14, 2023
విక్టరీ వెంకటేష్ నటిస్తున్నతాజా చిత్రం ‘సైంధవ్’. ‘హిట్’ సినిమా సిరీస్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
కాగా, ఈ సినిమాకి సంబంధించి కథ ఇదేనంటూ ఓ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తండ్రీ కూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందట.
అరుదైన వ్యాధితో బాధపడే కూతురు, అదే తరహా వ్యాధితో బాధపడే విలన్.. కూతురుని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం, అదే సమయంలో తనను తాను కాపాడుకోవడానికి విలన్ చేసే యత్నాలు.. ఇద్దరికీ ఒకటే అవసరం.!
ఈ తరహా నేపథ్యంలోనే ‘సైంధవ్’ స్టోరీ వుండబోతోందనీ ప్రచారం జరుగుతోంది. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరోకీ, విలన్‌కీ మధ్య సాగే పోరాటం తెరపై అత్యద్భుతంగా సృస్టించాడట శైలేష్ కొలను.
యాక్షన్ ఘట్టాల ప్రధానంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే వుంటుందట. అలాగే హృద్యమైన సెంటిమెంట్ వెంటాడుతుందట. ఇటీవల తండ్రీ కూతురి నేపథ్యంలో వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే వెంకటేష్ కూడా విక్టరీ కొడతాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!