లేడీ సూపర్ స్టార్ అని పిలవడంపై నయన తార సంచలన వ్యాఖ్యలు.!
- December 14, 2023
‘సౌత్ క్వీన్’, ‘లేడీ సూపర్ స్టార్’.. అంటూ నయన తారను ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటుంటారు. ‘సౌత్ క్వీన్’ ఓకే.! కానీ, లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం తనకు ఇష్టముండదని అలా పిలిస్తే తనను తిట్టినట్లుగా వుంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది నయన తార.
నయన తారకు సంబంధించిన ఏ న్యూస్ అయినా అదో సెన్సేషనే. అలాంటిది, ఇలాంటి సెన్సేషన్స్ ఆమెనే క్రియేట్ చేస్తే.. కానీ, ఈ మాటల పట్ల కొందరు నొచ్చుకుంటున్నారు.
లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకోవడమనేది అందరికీ జరిగేది కాదు. అదో ఉన్నతమైన గౌరవం. సీనియర్ నటి అయిన విజయ శాంతిని మాత్రమే ఇలా పిలిచే వారు.
ఇప్పుడు ఆ అపూర్వమైన గౌరవం నయన తారకు దక్కింది. కానీ, నన్ను అలా పిలవొద్దు.. అంటూ నయన్ చెప్పడం ఒకింత ఆశ్చర్యంగా వుంది.
అన్నట్లు నయన్‌ని అలా పిలవడం పట్ల కొందరు నటీమణులు కూడా కుళ్లుకుంటారు. అలాంటిది, తనకి తానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతవరకూ తెలుగు, తమిళ, ఇతర భాషల్లో నటించిన నయన తార ఇటీవలే ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!