ఇండస్ ఆస్పత్రి ప్రమాదం ఘటనలో యాజమాన్యం పై కేసు నమోదు
- December 15, 2023
విశాఖపట్నం: విశాఖలోని జగదాంబ ఇండస్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఘటనలో యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఐదుగురు సభ్యులతో కమిటీ వేయగా వారు వివరాలు సేకరించి కలెక్టర్ కు నివేదిక అందజేశారు. కమిటీ దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇది యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని కమిటి నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
గురువారం (డిసెంబర్ 14,2023)న ఇండస్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 46 మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇండస్ ఆస్పత్రిలో మొత్తం 150 పడకలు ఉండగా.. 46మంది ఇన్ పేషెంట్లుగా ఉన్నారు. వీరిలో 16మంది ఐసీయూలో చికిత్సపొందుతున్నారు. అగ్నిప్రమాదం సంభవించటంతో రోగులను మెడికవర్ ఆసుపత్రితో పాటు కెజిహెచ్, విజేత ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై కమిటి వేయగా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా తేలింది. దీంతో కలెక్టర్ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







