‘స్పిరిట్’ సంగతేంటి.! సందీప్ రెడ్డీ.!
- December 15, 2023
ఒక్క సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఆశ్చర్యమేంటంటే, టాలీవుడ్లోనూ, బాలీవుడ్లోనూ కూడా అదే సినిమా ఆయనను స్టార్ డైరెక్టర్ని చేసేయడమే.
ఆయన మరెవరో కాదు, ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషనల్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’ ఏదో అలా కలిసొచ్చేసిందంతే. అదే రీమేక్ మళ్లీ హిందీలోనూ కలిసొచ్చేసింది. లక్కంటే ఇదేనేమో.!
అయితే, ఆయన ఎన్ని సినిమాలు తీసినా అందులోని హీరో, మరియు సోల్ ఒకే తరహాలో వుంటాయని ప్రేక్షకులు ఓ అంచనాకి వచ్చేశారు.
అప్పట్లో ‘అర్జున్ రెడ్డి’ పలు వివాదాలకు పోగా.. ఏదో మ్యాజిక్ జరిగింది. అద్భుతమైన విజయం అందుకుంది. ఇప్పుడు ‘యానిమల్’ ముచ్చట కూడా అంతే.
పిచ్చ పిచ్చగా తిట్టుకుంటూనే ఈ సినిమాని ఆదరించేశారు ప్రేక్షక జనం. దాంతో, బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కురుస్తోంది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. ‘యానిమల్’ వసూళ్లు రాబడుతోంది.
ఈ క్రేజ్ చూసి, ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో సందీప్ రెడ్డి వున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సీక్వెల్ పట్టుకుని కూర్చుంటే.. ప్రబాస్తో చేయాల్సిన ‘స్పిరిట్’ సంగతేంటీ.! అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
అలాగే, ప్రబాస్తోనూ మళ్లీ ‘యానిమల్’ సినిమానే తీస్తాడు సందీప్ రెడ్డి వంగా.! ఇప్పట్లో చేయకపోతేనే బెటర్.! అనే అభిప్రాయాల్లోనూ కొందరున్నారు. మరి, సందీప్ రెడ్డి మనసులో ఏముందో తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాలి. ప్రస్తుతం ఆయన ‘యానిమల్’ సక్సెస్ని ఎంజాయ్ చేసే పనిలో వున్నాడు మరి.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







