శివాజీ గేమ్ ఉల్టా ఫుల్టా.! ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్.!

- December 15, 2023 , by Maagulf
శివాజీ గేమ్ ఉల్టా ఫుల్టా.!  ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్.!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 సివరాఖరికి చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ ఎపిసోడ్ పూర్తి కానుంది. కాగా, ఇంతవరకూ టైటిల్ విన్నర్ శివాజీనే అంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజా పరిణామాల దృష్ట్యా ఆ ఆలోచన మారుతోంది.

ఇంతవరకూ చాలా హుందాగా, పెద్దరికంతో వ్యవహరించిన శివాజీ అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడు. మొన్నీ మధ్యనే శోభపై చేసిన వ్యాఖ్యలకు గాను నాగార్జునతో సీరియస్ క్లాస్ పీకించుకున్నాడు శివాజీ.

ఇప్పుడు మళ్లీ అదే తీరు. నోటి కొచ్చిన వాగుడు వాగుతున్నాడంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది.

గేమ్ శివాజీ కోర్టులోంచి, అమరదీప్ కోర్టులోకి వెళ్లిపోయింది ఈ మధ్య అనూహ్యంగా. బయటి నుంచి అమరదీప్‌కి కూడా బాగా సపోర్ట్ లభిస్తోంది. ఇక, హౌస్‌లోనూ అమర దీప్ తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో అమరదీప్‌ని టార్గెట్ చేస్తూ శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనపై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయ్. ఈ విషయం గుర్తెరిగి మసలుకుంటే బాగుంటుందని శివాజీ అభిమానులు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com