ఉసిరితో థైరాయిడ్కి ఉపశమనం.!
- December 15, 2023
ధైరాయిడ్ వ్యాధి మొత్తం శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువగా స్త్రీలలో కనిపించే ఈ వ్యాధి తీవ్రత చలికాలంలో ఇంకాస్త ఎక్కువగా వుంటుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే, డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవల్సిన అవసరం వుందని నిపుణులు చెబుతున్నారు.
ధైరాయిడ్ వన్స్ ఎటాక్ అయ్యిందంటే చాలు.. దాన్ని నియంత్రించడం కష్టం. జీవితాంతం మందులు వాడాల్సిందే. అయితే, కంట్రోల్లో వుంచుకునేందుకు వైద్య చికిత్సతో పాటూ, కొన్ని నేచురల్ రెమిడీస్ కూడా వాడాల్సి వుంటుంది.
అందులో ముఖ్యంగా ఉసిరిని తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉసిరి నుంచి లభిస్తాయ్.
ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి పాత్ర ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాగే, థైరాయిడ్ గ్రంధిపైనా ఉసిరి ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంధి వాపును తగ్గించడంలోనూ, నొప్పి నివారణలోనూ ఉసిరి తోడ్పడుతుంది.
ఉసిరిలోని విటమిన్ సి, ఎ, కె, ఫోలేట్ యాసిడ్స్.. ధైరాయిడ్ గ్రంధి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయ్. అలాగే, దనియాలు కూడా థైరాయిడ్ కంట్రోల్‌కి మంచి ఫలితాన్నిస్తాయ్. రాత్రిపూట నానబెట్టిన దనియాల నీటిని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల థైరాయిడ్‌తో బాధపడేవారికి చాలా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







