కళ్యాణ్ రామ్‌కి ఏంటీ తలనొప్పి.!
- December 15, 2023
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ సినిమాకి సంబంధించి ఓ వార్త హాట్ హాట్‌గా చర్చల్లో నిలిచింది. అందుకు కారణం ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన మార్క్ బెనింగ్‌టన్ లేటెస్టుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే.!
ఇంతకీ ఆయన చేసిన పోస్ట్ సారాంశం ఏంటీ.? అంటే, ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంకా డబ్బులివ్వలేదట ఈయనకు. దాంతో, ఆయన రచ్చకెక్కారు. నిర్మాణ సంస్థను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, తన పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారనీ, అగ్రిమెంట్‌లో ఆ రూల్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. అందుకు తాజాగా స్పందించిన చిత్ర యూనిట్ అలాంటిదేమీ లేదనీ, ఆయనకు ముట్టచెప్పాల్సిన డబ్బులు ఎప్పుడో ముట్టచెప్పేశామనీ, తన మేనేజర్ ఏదో కిరికిరి చేశాడనీ.. అది తెలుసుకోకుండా నిర్మాణ సంస్థపై ఇలా అవాకులు చవాకులు పేలడం బాగా లేదని స్పందించింది.
గతంలోనూ కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా విషయంలోనూ ఇలాంటి ఇష్యూసే బయటికొచ్చాయ్. అలాగే, ఇప్పుడు ‘డెవిల్’ విషయంలోనూ జరుగుతోంది. పాపం.! కళ్యాణ్ రామ్‌కి ఏంటీ తలనొప్పి.! అంటూ అభిమానులు వాపోతున్నారు.
కాగా, అభిషేక్ నామా పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంయుక్తా మీనన్ హీరోయిన్. మాళవికా నాయర్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







