కువైట్ లో 209 మంది నివాసితులు అరెస్ట్

- December 16, 2023 , by Maagulf
కువైట్ లో 209 మంది నివాసితులు అరెస్ట్

కువైట్: రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, సూపర్‌విజన్ అండ్ కోఆర్డినేషన్ డిపార్ట్‌మెంట్, త్రిసభ్య కమిటీ చేపట్టిన సెక్యూరిటీ క్యాంపెయిన్ లో భాగంగా 209 మంది నివాసితులను అరెస్ట్ చేశారు. మహ్బౌలా, సబా అల్ నాసర్, షార్క్, హవల్లి మరియు ఫహాహీల్‌లో నిర్వహించిన తనిఖీలలో రెసిడెన్సీ, వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 162 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వివిధ గవర్నరేట్‌లలో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న వివిధ మొబైల్ ఫుడ్ సంస్థల వద్ద రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 47 మందిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com