ఓవర్ స్పీడ్ డ్రైవింగ్..3,000 దిర్హాంల జరిమానా
- December 16, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమా పోలీసులు శుక్రవారం ట్రాఫిక్ భద్రతా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీడ్ డ్రైవింగ్ చేసే డ్రైవర్లను హెచ్చరించారు. ప్రచారం సందర్భంగా ఎమిరేట్‌లోని ట్రాఫిక్ అధికారులు అనేక ఉల్లంఘనలను నమోదు చేశారు. చాలామంది యువకులు తమ వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతున్నారని రస్ అల్ ఖైమా పోలీస్‌లోని ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ కల్నల్ డాక్టర్ ముహమ్మద్ అల్ బహర్ అన్నారు. డ్రైవర్లందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని, అన్ని నిబంధనలను అనుసరించాలని అధికారి పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నేరాలను ఎమిరేట్ అంతటా, బాహ్య నుండి అంతర్గత రోడ్ల వరకు నిశితంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. తాజా రహదారి భద్రత ప్రచారంలో భాగంగా అతివేగం మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ఘోరమైన ప్రమాదాలను తగ్గించాలని ఆయన సూచించారు. మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. 178 ప్రకారం కల్నల్ అల్ బహర్ స్పీడ్‌స్టర్‌లకు భారీ జరిమానాలను విధిస్తామని పేర్కొన్నారు.
-80kmph కంటే ఎక్కువ వేగ పరిమితిని మించిన వారికి: 3,000 దిర్హామ్‌ల జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు, 60-రోజుల వాహన జప్తు
-పరిమితిని దాటి 60kmph వేగంతో వెళ్లే వారికి: Dh2,000, 12 బ్లాక్ పాయింట్లు మరియు 30-రోజుల వాహన జప్తు
-20కిలోమీటర్ల వేగ పరిమితి దాటిన వారికి జరిమానాలను కూడా విధించినట్లు కల్నల్ అల్ బహర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







