డిఫరెంట్ లుక్స్‌లో పవన్ కళ్యాణ్ హీరోయిన్.!
- December 16, 2023
‘ఎగిరే చిలకమ్మా.. అక్కడ ఏం రాసుందమ్మా..’ అంటూ పవన్ కళ్యాణ్‌తో ఆటపట్టించుకున్న ముద్దుగుమ్మ గుర్తుందా.? అదేనండీ.! ‘బంగారం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీరా చోప్రా.
తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసిందీ అందాల భామ. కానీ, కాంట్రవర్సీలు మాత్రం ఎక్కువగా మోసింది. రకరకాల పేర్లతో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మీరా చోప్రాగానే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుందనుకోండి.
అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో మీరా చోప్రా నటిస్తోంది. అదే ‘సఫేద్’. ఈ సినిమా కోసం విధవరాలి పాత్రలో కనిపించబోతోంది మీరా చోప్రా.
తాజాగా ఈ పాత్రకి సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైట్ శారీలో వున్న మీరా చోప్రాని చూసి ఈమె ఆమేనా.? అనే ఆశ్చర్యం కలుగుతోంది. అంతలా మేకోవర్ మీరా చోప్రాలో.
ఇంతకీ ‘సఫేద్’ కథేంటీ.? ఎందుకోసం ఆమె విధవరాలుగా మారాల్సి వచ్చింది.? మీరా చోప్రా భర్త పాత్ర పోషించిందెవరు.? తెలియాలంటే, లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







