దోహా: తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
- December 17, 2023
దోహా: అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం మరియు ఖతార్ నేషనల్ డే సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, తెలంగాణ సమితి వారి పిలుపుమేరకు ఖతార్ లోని నలుమూల ప్రాంతాలు అనగా మాల్ అల్కోర్ మెకానిష్ సహనియా తదితర ప్రాంతాల నుండి సుమారు 175 తెలుగు వారు హాజరై 130 వరకు దాతలు పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమం ఖతార్ నేషనల్ బ్లడ్ డొనేషన్ సెంటర్ అల్సద్ లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది.కార్యక్రమం ప్రారంభ సమయంలో తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షులు మధు అందరికీ స్వాగతం పలుకుతూ తెలంగాణ గల్ఫ్ సమితి చేస్తున్న కార్యక్రమాలను సమన్వయంగా వివరించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి కార్యాలయం నుండి ఫస్ట్ సెక్రటరీ మరియు ICBF CEO డాక్టర్ వైభవ్ తండలే ముఖ్యఅతిథి గా విచ్చేసి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేసినందుకు అభినందించారు.
అతిథులుగా ICBF ప్రెసిడెంట్ షానవాస్ బావ మాట్లాడుతూ ఐ.సి.బి.ఎఫ్ చేస్తున్న కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి ఎల్లప్పుడూ ముందుండి మాకు తోడుగా ఉంటుందని కొనియాడారు.
ICC ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు కాకుండా ఐసిసి తలపెట్టే సంస్కృత కార్యక్రమంలో కూడా గల్ఫ్ సమితి బృందం ఎల్లప్పుడూ ముందుంటుందని గుర్తు చేశారు.
అనంతరం తెలుగు సంఘాల సీనియర్ నాయకుడు కోడూరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా తెలుగు వారందరం ఒక్కటై ఏ కార్యక్రమాన్ని చేసిన కూడా తోడుగా ఉంటూ మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందని గుర్తు చేశారు.
అనంతరం రక్తదానం చేసిన సభ్యులందరికీ శాలువాతో సత్కరించి మరియు ప్రశంస పత్రం అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ICBF కమిటీ సభ్యులు భోబన్, కుల్దీప్ కౌర్, మహమ్మద్ కొని గారు, శంకర్ గౌడ్, అబ్దుల్ రఫ్, కులివెందుర్ సింగ్ ఐసీసీ నుండి మోహన్ కుమార్, నందిని అబ్బ గౌని, తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షులు సుధా, ప్రధాన కార్యదర్శి ప్రవీణ తెలుగు స్పోర్ట్స్ సెంటర్ అధ్యక్షులు శ్రీధర్ అబ్బ గోని మరియు తెలంగాణ గల్ఫ్ సమితి కమిటీ మెంబర్ గడ్డి రాజుగారు, మను, సాగర్, సంజీవ్, సంధ్యారాణి, ప్రియా మరియు సలహాదారులు ఎల్లయ్య , శోభన్ గౌడ్ , కృష్ణ మరియు గల్ఫ్ సమితి సభ్యులు అందరూ ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









