ఈజిప్ట్ ప్రెసిడెంట్ గా తిరిగి ఎన్నికైన అబ్దెల్ ఫత్తా అల్-సిసి

- December 19, 2023 , by Maagulf
ఈజిప్ట్ ప్రెసిడెంట్ గా తిరిగి ఎన్నికైన అబ్దెల్ ఫత్తా అల్-సిసి

బహ్రెయిన్: ఈజిప్టు ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్-సిసి 89.6 శాతం ఓట్లతో మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అథారిటీ సోమవారం ప్రకటించింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం 66.8 శాతం ఓటర్లకు చేరుకుందని అథారిటీ హెడ్ హజెమ్ బదావీ చెప్పారు. ఒక దశాబ్దం పాటు అత్యధిక జనాభా కలిగిన అరబ్ దేశాన్ని పాలించిన మాజీ ఆర్మీ చీఫ్ సిసికి 39 మిలియన్లకు పైగా ఓట్లు వచ్చాయన్నారు. డిసెంబర్ 10 -12 తేదీల మధ్య ఓటింగ్‌ జరిగింది. రిపబ్లికన్ పీపుల్స్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రన్నరప్ హజెమ్ ఒమర్‌కు 4.5 శాతం ఓట్లు వచ్చాయి.  రాజ్యాంగం ప్రకారం.. ఏప్రిల్‌లో ఆయన మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పొరుగున ఉన్న గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఈజిప్ట్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. అయినప్పటికీ సిసి విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం ఈజిప్ట్ కరెన్సీ విలువ క్షీణించింది. వార్షిక ద్రవ్యోల్బణం 36.4 శాతం వద్ద ఉంది.  నిత్యవసరాల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు 106 మిలియన్ల ఈజిప్టు జనాభాలో మూడింట రెండు వంతుల మంది దారిద్య్ర రేఖకు దిగువన లేదా దిగువన జీవిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com