బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కోసం పోలీసుల గాలింపు.!

- December 20, 2023 , by Maagulf
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కోసం పోలీసుల గాలింపు.!

బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌ పూర్తయ్యాకా కూడా సంచలనంగా వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం ఈ సీజన్ విజేత అయిన పల్లవి ప్రశాంత్.

రైతు బిడ్డగా హౌస్‌లో ప్రవేశించిన పల్లవి ప్రశాంత్ ఓ వర్గం ఆడియన్స్ మెప్పు పొందాడు. కానీ, అనవసరమైన ఆటిట్యూడ్‌తో మరో వర్గంలో తీవ్రమై వ్యతిరేకత కూడా పొందాడు.

ఎట్టకేలకు ఫైనలిస్ట్‌గా మారి, బిగ్‌బాస్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు. అంతా బాగానే వుంది కానీ, ఫైనలిస్టుని ప్రకటించడంలో  ఏదో మస్కా చస్కా జరిగిందన్న అనుమానాలున్నాయ్.

దాంతో, రన్నర్‌గా నిలిచిన అమరదీప్ అభిమానులకీ, పల్లవి ప్రశాంత్ అభిమానులకీ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయ్. చిలికి చిలికి గాలివానలా మొదలైన ఈ గొడవ తారా స్థాయికి చేరుకోవడం, అది కాస్తా బిగ్‌బాస్ నిర్వహకులకు తెలియడంతో ట్రోఫీ అందించాకా గుట్టు చప్పుడు కాకుండా, బిగ్‌బాస్ హౌస్ వెనక ద్వారం నుంచి పల్లవి ప్రశాంత్‌ని పంపించే ప్రయత్నం చేశారు నిర్వహకులు.

కానీ, అది పట్టించుకోని పల్లవి ప్రశాంత్ ఆటిట్యూడ్ చూపించి, ప్రవేశ ద్వారం ద్వారా పబ్లిక్‌గా వచ్చాడు. దాంతో, అల్లరి పెద్దదైంది. అక్కడే వున్న అమరదీప్ తదితర ఇతరత్రా కంటెస్టెంట్లపై దాడికి దిగారు పల్లవి ప్రశాంత్ అభిమానులు.

అక్కడితో ఆగలేదు.. ఆర్‌టీసీ బస్సుల పైనా వారు రాళ్లు రువ్వారు. దాంతో, పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. అతను పరారీలో వున్నట్లు గుర్తించారు. అతని కోసం స్పెషల్ పోలీస్ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com