ఆర్గాన్ డొనేషన్ కోసం 11వేలకుపైగా పేర్లు నమోదు

- December 20, 2023 , by Maagulf
ఆర్గాన్ డొనేషన్ కోసం 11వేలకుపైగా పేర్లు నమోదు

మస్కట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క షిఫా యాప్ లో ఆర్గాన్ డొనేషన్ కోసం 11,262 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య ఈ సంవత్సరం 37 శాతం పెరిగింది. గత సంవత్సరం, 7,092 మంది నమోదు చేసుకున్నారని ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అవయవ మార్పిడి ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ డిపార్ట్‌మెంట్ కింద ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఒమానీ ఆర్గాన్ డొనేషన్ డేని నిర్వహించింది. కౌన్సిల్ ఆఫ్ మంత్రుల సెక్రటేరియట్ జనరల్ సెక్రటరీ జనరల్ హెచ్హెచ్ సయ్యద్ కామిల్ ఫహద్ అల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అవయవ దానం ప్రాముఖ్యత గురించి ముఖ్యంగా మూత్రపిండాలు, కాలేయం, కళ్లు సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోగులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ బుసైది పాల్గొని ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతని వివరించారు. ముఖ్యంగా మూత్రపిండ మార్పిడి కార్యకలాపాల సంఖ్య పెరిగిందని, ఈ సంవత్సరం 17 మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు వివరించారు. అలాగే కార్నియల్ మార్పిడి  చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అనేక మంది జీవన అవయవ దాతలు, మరణానంతర అవయవ దాతల బంధువులను సత్కరించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com