యూఏఈలో స్లో డ్రైవింగ్ చేస్తే.. Dh400 జరిమానా!

- December 20, 2023 , by Maagulf
యూఏఈలో స్లో డ్రైవింగ్ చేస్తే.. Dh400 జరిమానా!

యూఏఈ: స్పీడ్ రోడ్లపై స్లో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. ముఖ్యంగా హై స్పీడ్ లేన్లలో ఇది ప్రాణాంతకం. దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడమ నుండి మొదటి లైన్ అత్యవసర రెస్పాండ్ వాహనాల కోసం కేటాయించారు.  మొదటి లేన్ అవసరమైతే తప్ప వినియోగించవద్దు. కానీ గరిష్టంగా అనుమతించిన  వేగ పరిమితిలో డ్రైవ్ చేయడానికి యూఏఈ నివాసితులు దీనిని తరచుగా ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు.  140 కిలోమీటర్ల రహదారిపై మొదటి రెండు లేన్లలో 130 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసే వ్యక్తులు అకస్మాత్తుగా 100 కిలోమీటర్ల లోపు వెళ్లడం చాలా ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. హై స్పీడ్ రోడ్లపై నెమ్మదిగా డ్రైవింగ్ చేయకుండా ఉండటానికి అధికారులు జరిమానాలు అమలు చేశారు. దుబాయ్ మరియు అబుదాబిలను కలిపే షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్‌లో ఏప్రిల్ 2023 జరిమానాలను విధిస్తున్నారు. ఉదహరణకు 140 కిలోమీటర్ల రహదారి మొదటి రెండు లేన్లలో 120 కిలోమీటర్ల లోపు డ్రైవింగ్ చేస్తే అబుదాబి పోలీసులు Dh400 జరిమానాను విధిస్తున్నారు.  నివాసితులకు అధికారికంగా జారీ అవుతున్న నిబంధనలను తెలుసుకోవాలని దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA), యూఏఈ అధికారులు సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com