‘యాత్ర 2’ నుంచి కొత్త‌ పోస్టర్ రిలీజ్

- December 21, 2023 , by Maagulf
‘యాత్ర 2’ నుంచి కొత్త‌ పోస్టర్ రిలీజ్

హైదరాబాద్: యాత్ర 2 2019లో ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్‌ యాత్ర. మహి వి రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యం సాధించింది. ఈ సూపర్‌ హిట్‌ మూవీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర 2. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి త‌న‌యుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ జీవా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌, ఫ‌స్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా వుంటే.. గురువారం (డిసెంబర్‌ 21) వైఎస్‌ జగన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇక ఈ పోస్ట‌ర్‌లో ఒక‌వైపు జీవా కూర్చొని ఉండ‌గా.. మ‌రోవైపు మమ్ముట్టి ఉన్నాడు. ఈ పోస్ట‌ర్‌లో ”నేనెవ‌రో ఈ ప్ర‌పంచానికి ఇంకా తెలియ‌కపోవ‌చ్చు. కానీ ఒక్క‌టి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్‌రెడ్డి కొడుకుని” అంటూ పోస్ట‌ర్‌లో రాసుకోచ్చారు. ఇక ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటిస్తుండగా వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా నటిస్తున్నారు.

త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌ యూనిట్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com