సినిమా రివ్యూ: ‘డుంకీ’

- December 21, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘డుంకీ’

షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రమే ‘డుంకీ’. ఈ ఏడాది ఆల్రెడీ ‘పటాన్’, ‘జవాన్’ సినిమాలతో సూపర్ హిట్టు కొట్టేశాడు షారూఖ్ ఖాన్. దాంతో, ఈ సినిమాపైనా అంచనాలు మొదలయ్యాయ్. అందుకు తగ్గట్టుగానే ‘డుంకీ’ ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా వుండడంతో ఆటోమెటిగ్గా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయ్. అంతేకాదు, రాజ్ కుమార్ హీరానీ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం మరో అస్సెట్. మరి, అంచనాల్ని ‘డుంకీ’ అందుకుందా.? షారూఖ్ లిస్టులో హ్యాట్రిక్ పడిందా.? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
సైనికుడైన హర్డీ సింగ్ (షారూఖ్ ఖాన్) యుద్దంలో తన ప్రాణాలు కాపాడిన సైనికుడిని కలిసేందుకు పంజాబ్‌లోని ఊరికి వెళతాడు హర్డీ సింగ్.  అక్కడికెళ్లాకా తెలుస్తుంది ఆ వ్యక్తి ప్రాణాలతో లేడని. అతని చెల్లెలు మను (తాప్సీ పన్ను) ఇంటి కష్టాలను తీర్చేందుకు లండన్ వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనుకుంటుంది. అదే ఊరిలో మను స్నేహితులుగా వున్న మరో ముగ్డురు కుర్రాళ్లు కూడా అదే ఆలోచనలో వుంటారు. ఎలాగైనా కష్టపడి లండన్ వెళ్లాలని అనుకుంటారు. వారికి హర్డీ సింగ్ ఎలాంటి సాయం చేశాడు.? అసలు వాళ్లు లండన్ వెళ్లారా.? ఆ తర్వాత ఏం జరిగింది.? తెలియాలంటే ‘డుంకీ’ సినిమా చూడాల్సిందే.!

నటీనటుల పని తీరు:
ఆల్రెడీ ‘పటాన్’, ‘జవాన్’ సినిమాల్లో షారూఖ్ ఖాన్ డిఫరెంట్ వేరియేషన్ వున్న పాత్రల్లో నటించి మెప్పించాడు. తెలుగు వెర్షన్స్ కూడా రిలీజ్ కావడంతో షారూఖ్ ఖాన్‌కి తెలుగు ప్రేక్షకులు సైతం బాగా కనెక్ట్ అయిపోయారు. ఆ కనెక్షనే ‘డుంకీ’ సినిమా కోసం ఆశగా ఎదురు చూసేందుకు కారణమైంది. అయితే ఈ సినిమాలో డిఫరెంట్ డైలాగ్ డెలివరీని డిజైన్ చేశారు షారూఖ్ పాత్రకి. అది కామెడీ పండించడంలో బాగానే వర్కవుట్ అయ్యింది. కానీ, కొన్ని ఎమోషనల్ సీన్లలో ఇబ్బందికరంగా అనిపించింది. ఓవరాల్‌గా షారూఖ్ తనదైన పర్‌ఫామెన్స్, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. మను పాత్రలో తాప్సీ పన్ను బాగా నటించింది. హీరోతో లవ్ ట్రాక్ కానీ, కెమిస్ర్టీ కానీ అంతగా పండలేదు. కాకపోతే, తన పాత్ర వరకూ 100కి రెండొందల మార్కులేయించుకుంది తాప్సీ. తన కెరీర్‌లో ఈ మను పాత్ర మరో మైలురాయిలాంటిది తాప్సీకి. మిగిలిన పాత్ర ధారుల్లో విక్కీ కౌశల్ పాత్ర కాస్త భిన్నంగా హ‌ృధ్యంగా డిజైన్ చేశారు. విక్రమ్ కోచర్ పంజాబీ కుర్రోడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. బొమన్ ఇరానీ పాత్రను ఇంకాస్త శక్తివంతంగా తీర్చి దిద్దితే బాగుండేది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. విజువల్స్ చాలా ఆహ్లాదరకంగా అనిపిస్తాయ్. నలుగురు సినిమాటోగ్రఫర్లు పని చేశారు ఈ సినిమాకి. నిర్మాణ విలువలు చాలా వున్నతంగా వున్నాయ్. నేపథ్య సంగీతం బాగుంది కానీ, పాటలు మాత్రం సో సోగా అనిపిస్తాయ్. ఎడిటింగ్ బాధ్యత కూడా డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీనే తీసుకున్నారు. ఓకే బాగానే వుంది. అయితే, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సినిమాలంటే వినోదంతో పాటూ, ఒక రకమైన సోషల్ మెసేజ్ కూడా ఆశిస్తారు ప్రేక్షకులు. అది ఈ సినిమాలో అంత ఆసక్తికరంగా అనిపించదనిపిస్తుంది. వినోదం వరకూ ఓకే కానీ, ఎమోషనల్ సీన్లు చాలా చోట తేలిపోతాయ్. అక్రమ వలసల ద్వారా యూరప్ చేరుకున్న వారి కష్ట సుఖాలు.. అక్రమ వలసదారుల కారణంగా యూరప్ దేశాలకు కలిగిన, కలుగుతున్న నష్టాలు.. గట్రా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు కానీ, ఆ పాయింట్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వదు. రాజ్ కుమార్ హిరానీ కథల్లో వుండే అసలు సిసలు పాయింటే అది. అదే ఈ సినిమాలో మిస్ అయ్యిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
షారూఖ్ నటన, కడుపుబ్బా నవ్వించే ఫస్టాఫ్, విజువల్స్, లండన్‌ చేరుకున్నాక పాకిస్థాన్ సైనికులకు బంధీలుగా పట్టుబడిన తన స్నేహితుల్ని కాపాడే క్రమంలో డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్,

మైనస్ పాయింట్స్:
హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్, ఆకట్టుకోని ఎమోషన్, వీక్ క్లైమాక్స్,

చివరిగా:
 ‘డుంకీ’ని ఏదో టైమ్ పాస్‌కి చూసేయొచ్చు. కానీ, రాజ్ కుమార్ హిరానీ యాంగిల్‌లో అది కూడా షారూఖ్ కాంబినేషన్‌లో హై రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ చేస్తే మాత్రం డుంకీ కొట్టేస్తారు.! లాజిక్కులు వెతక్కుండా జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయితే ఓకే.!

Gulf Distributor: Phars Filmco LLC

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com