ఈ నెల 24న సూర్య‌కాంతం శ‌తాబ్ధి పుర‌స్కారాలు..

- December 21, 2023 , by Maagulf
ఈ నెల 24న సూర్య‌కాంతం శ‌తాబ్ధి పుర‌స్కారాలు..

ఎఫ్‌టిపీసీ ఇండియా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు చైత‌న్య జంగా, పీవీఎస్ వ‌ర్మ వెల్ల‌డి

హైద‌రాబాద్‌: తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందిన అల‌నాటి న‌టీమ‌ణి సూర్యకాంతం పేరిట ఫిలింన‌గ‌ర్‌లోని తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ భ‌వ‌నంలో ఈ నెల 24న సూర్య‌కాంతం శ‌తాబ్ధి పుర‌స్కారాల‌ను ఫిలిం అండ్ టెలివిజ‌న్ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిపీసీ ఇండియా), తెలుగు సినిమా వేదిక సంయుక్త నిర్వ‌హ‌ణ‌లో అంద‌జేస్తున్న‌ట్లు ఎఫ్‌టిపీసీ ఇండియా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు చైత‌న్య జంగా, పీవీఎస్ వ‌ర్మ సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాల‌లో విశిష్ట ప్ర‌తిభాపాట‌వాలు క‌లిగిన విభిన్న రంగాల్లోని వ్య‌క్తుల‌కు సూర్య‌కాంతం లాంటి మ‌హాన‌టి పేరుమీద వంద సంవ‌త్స‌రాల శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ పుర‌స్కారాల‌ను ప్ర‌దానం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. గ‌తంలో స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు, ఏఎన్నార్‌ల పేరిట ఘ‌నంగా అవార్డులు ప్ర‌దానం చేశామ‌ని ఎఫ్‌టిపీసీ ఇండియా నిర్వాహ‌కులు తెలిపారు. ఎఫ్‌టిపిసి ఇండియా వ‌ర‌ల్డ్ రికార్డు సాధించ‌డం మ‌రో మైలురాయి అని, పాత త‌రం వారిని స్మ‌రించుకుంటూ కొత్త వారికి స్ఫూర్తిగా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తున్నామ‌ని చెప్పారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ద‌ర్వాజ‌, ప్ర‌ముఖ న‌టులు శ్రీకాంత్‌, శివాజీరాజా, అన్న‌పూర్ణ‌, జ్యోతి, త‌దిత‌ర ప్ర‌ముఖ తారాగ‌ణం హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి మీడియా పార్ట‌న‌ర్‌గా మా గ‌ల్ఫ్ న్యూస్ వ్య‌వ‌హ‌రిస్తార‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com